Sandhya Pada Pada Padamani Ante Sigge Apinda Song Lyrics - Middle Class Melodies

సంధ్యా! పదపదపదమని అంటే సిగ్గే ఆపిందా!! బావా అని పిలిచేందుకు మోమాటంతో ఇబ్బందా!!

Sandhya Song Lyrics in Telugu - Middle Class Melodies Movie

 సంధ్యా!

పదపదపదమని అంటే సిగ్గే ఆపిందా!!

బావా అని పిలిచేందుకు మోమాటంతో ఇబ్బందా!!


నువు వణక్క, తొణక్క, బెరక్క, సరిగ్గ ఉంటే చాలే...

కథ వెనక్కి  జరక్క  చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే...


ఇది వయస్సు విపత్తు, ఒకింత తెగించి ఉంటే మేలే...

విధి తరించి, తలొంచి కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే...


మధ్యలో ఉన్నది దగ్గరో, దూరమో కాస్తైనా తెలిసిందా!!

ఎంతకీ తేలని ప్రేమలో తేలడం ఏమైనా బాగుందా!!


మాటలని కుక్కేసావే మనసు నిండా,

వాటినిక పంపేదుందా పెదవి గుండా...


బిడియంతో సహవాసం ఇక చాలు బాలిక,

అది ఎంతో అపచారం అని అనుకోవేం చిలకా!! ...

*  ||సంధ్యా||


*చరణం:-


ఏం సరిపోద్దే నువు చూపే ప్రేమా!

ఓ తెగ చూస్తే పనులేవీ కావమ్మా!!


పైకలా ఔపిస్తాడే ఎవరికైనా,

వాడికీ ఇష్టం ఉందే తమరి పైనా...


విసిరావో గురిచూసి వలపన్న బాణమే,

పడిపోదా వలలోన  పిలగాడి ప్రాణమే...*

*సంధ్యా!  పదపదపదమని అంటే సిగ్గే ఆపిందా!!

ఔనే...పొగరుని ప్రేమతో మనిషినిజేస్తే నీ బావే...


నువు వణక్క, తొణక్క, బెరక్క, సరిగ్గ ఉంటే చాలే...

కథ వెనక్కి  జరక్క  చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే...

ఇది వయస్సు విపత్తు, ఒకింత తెగించి ఉంటే మేలే...

విధి తరించి తలొంచి కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే...

Song Name: Sandhya
Lyrics: Sanapati Bharadwaj Patrudu
Singer: Sweekar Agasthi
Music: Sweekar Agasthi



Check State-wise Question Papers
Hi, I'm Rajesh Gundamalla, the face behind this website. Join me in the realm of education and government jobs, where I unravel insights, tips, and updates. Let's navigate the path to success…

Post a Comment