SSC MTS Syllabus in Telugu 2019 Download IN PDF
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) పదోతరగతి అర్హతతో దాదాపు పదివేల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామ్, 2019కు సంబంధించిన సూచనాత్మక ప్రకటనను ఎంప్లాయిమెంట్ న్యూస్ (20-26 ఏప్రిల్ 2019)లో ప్రచురించింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, వాటి సబార్డినేట్ కార్యాలయాల్లో ప్యూన్, సఫాయివాలా, చౌకీదార్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. సవివర ప్రకటన ఏప్రిల్ 22 నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి సెప్టెంబరు 6 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. 18-25 సంవత్సరాల అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
SSC MTS Syllabus as per previous advertisements: గత ప్రకటనల ప్రకారం పేపర్ 1, పేపర్ 2, స్కిల్ టెస్ట్‌ల ఆధారంగా ఈ పోస్టుల భర్తీ జరగనుంది. పేపర్ 1 (ఆబ్జెక్టివ్ టైప్)లో అర్హత సాధించినవారికి పేపర్ 2 (అభ్యర్థి ఎంచుకున్న భాషలో డిస్క్రిప్టివ్ టెస్ట్), స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు.